నగరంలో నాలా పూడిక తీత పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. మే చివరి నాటికి పనులు పూర్తి కావాల ని లక్ష్యనిర్దేశం చేసుకున్నా,ఇప్పటికి 70 శాతం పూడిక మాత్రమే తొలగించారు. వర్షాకాలం రోజుల్లోకి వచ్చేసింది. దీంతో, నగర ప్రజలు వర్షబీభత్స పరిస్థితులు తల్చుకుని ఆందోళనకు గురవుతున్నారు.
హైదరాబాద్ నగరంలో నాలాల పూడికతీత విషయంలో బల్దియా నిర్లక్ష్యం వీడలేదా? మే చివరి నాటికి పూర్తి కావాల్సిన నాలా పూడిక తీత పనులు ఇప్పటికీ కోనసాగుతున్నాయా ? అంటే, ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతోంది. ఇప్పటి వరకు 70 శాతం పూడిక మాత్రమే తొలగించారు. ఇంకా వందలాది కిలోమీటర్ల నాలాలు, వరద నీటి కాలువల్లో పూడిక పేరుకుపోయి ఉంది. గంట వ్యవధిలో రెండు సెంటిమీటర్ల వర్షం పడితే మాత్రమే నెట్టుకు వచ్చే గ్రేటర్ డ్రైనేజ్ వ్యవస్థను క్లీన్ చేయ్యక పోవడంతో నగర ప్రజలకు ఈ ఏడాది వర్ష ముంపు తప్పేలా లేదు. గ్రేటర్ పరిధిలోని ప్రధాన నాలాలు, వర్షపునీటి కాలు వలను పూడిక తీయడానికి జీహెచ్ఎంసి ప్రతి ఏటా పనులను చేపడుతోంది. దీంతో వర్షాకా లంలో వచ్చే వరద నీరు సాఫిగా నాలాల ద్వారా చెరువులతోపాటు, మూసి నదికి వేళ్లడానికి మార్గం సుగమం అవుతోం ది. బల్దియా పరిధిలో దాదాపు 1000 కిలో మీటర్ల మేర వర్షపు నీటి కాలువలు ఉన్నాయి. వీటిలో మేజర్ నాలాలు 398 కిలో మీటర్లు ఉండగా పైపులైన్ డ్రైన్లు, చిన్న సైజు నాలాలు 600 కిలో మీటర్లకు పైగా ఉన్నాయి. ప్రతి ఏడాది వర్షాకాలానికి ముందు వీటిలో పుడిక తీత పనులు చెపడ్తారు. ఇందు కోసం ప్రతి సంవత్సరం 55 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని బల్దియా అధికారులు అంచనా వేశారు.
గ్రేటర్ హైదరాబాద్లో చేపట్టిన 327 పూడిక పనుల్లో 83 మేజర్ నాలాల్లోని పూడికను యంత్రాల ద్వారా తొలగించాలని నిర్ణయించారు. 23 డ్రెయిన్లలో రీసైక్లర్స్ ద్వారా 214 చిన్న సైజు నాలాల్లో మాన్యువల్ గా పూడిక తియ్యాలని నిర్ణయించారు. నాలాల్లో పూడిక వ్యర్థాల తొలగింపుతో పాటు, పూడిక మట్టిని సమీప డంపింగ్ యార్డుకు తరలించే బాధ్యత సైతం కాంట్రాక్టర్లే చేపట్టాల్సి ఉంటుంది. ఈ పనులన్ని మే 31 నాటికి పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటి వరకు బల్దియా పరిధిలో మొత్తంగా మూడు లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీసినట్లు బల్దియా అధికార వర్గాలు తెలియజేస్తు న్నాయి. మొత్తం పూడిక 5 లక్షల 42వేల 239 క్యూబిక్ మీటర్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు మొత్తం 70 శాతం పూడికను మాత్రమే జిహెచ్ఎంసి తొలగించింది. మరో 30 శాతం పూడిక తొలగించాల్సి ఉంది. అయితే, ఇప్పటికే వర్షాలు ప్రారంభం అయిపోయాయి. వివిధ రకాలైన వ్యర్థాలు, చెట్లు నాలాల్లో నీటికి అడ్డంకిగా మారడా నికి కారణం అవుతున్నాయి. చాలా నాలాల్లో ఇలా నీటిని అడ్డుకునే విధంగా ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకు పోయింది. అంతే కాకుండా రోడ్డుపై వర్షం నీరుపోయే మ్యాన్ హోల్స్ ను శుద్ది చేయ్యకపోవడం సైతం ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లోని మ్యాన్ హోల్స్ వ్యర్థ పదార్థాలు, పాలిథిన్ కవర్లు, మట్టితో నిండిపోయి వర్షం నీరు పోవడానికి వీలు లేకుండా తయారయ్యా యి. కొన్ని ప్రాంతాల్లో అధికారులకు ఫిర్యాదు చేసిన నాలాలను శుద్ది చేయ్యడంలో అలసత్వం వహిస్తు న్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ప్రతి సంవత్సరం వర్షబీభత్సానికి నాలాలు పొంగి పొర్లి కాలనీలు, బస్తీలు అస్తవ్యస్థంగా మారుతు న్నాయి. గ్రేటర్ లోని చాలా ప్రాంతాల ప్రజలు రోజుల తరబడి నీటితో సహవాసం చేయ్యాల్సి వస్తోంది. ఈ ఏడాది సైతం నాలాల్లో పూడిక తీత పనులు వేగవంతంగా సాగలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేగం గా పనులు పూర్తి చేయాలని లేదంటే వర్షబీభత్సానికి ఇక్కట్లు ఎదుర్కోక తప్పదని నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


