లక్షలాది మందికి ప్రాణాలు పోసిన ఆ పెద్దసుపత్రి. నేడు చిన్న బోయింది. ఎంతో ఘన చరిత్ర కల్గిన దవాఖానా ప్రస్తుతం దారుణమైన స్థితికి చేరుకుంది. రోగుల ప్రాణాలు కాపాడే వైద్యాలయం నేడు ప్రమా దపు అంచులకు చేరింది. అదే శతాబ్దపు చరిత్ర ఉన్న ఉస్మానియా హస్పిటల్. శిథిలావస్థకు చేరుకున్న భవనంలో రోగులకు ప్రమాదం పొంచి ఉంది. నూతన భవనానికి ప్రభుత్వం ఉపిరి పోసేది ఎప్పుడు? ఇంతకీ ఉస్మానియా భవనం కూల్చేందుకు అడ్డుపడుతున్న అంశాలేంటి.? తక్షణం ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం నిర్మించరా!
హైదరాబాద్ షాన్ఉస్మానియా దవాఖానా వేలాది మందికి ప్రాణం పోసిన ఆసుపత్రి, ప్రజలకు కొత్త జీవితాన్ని ఇచ్చే వైద్యులు ఉస్మానియా హస్పిటల్ లో బిక్కు బిక్కు మంటు వైద్యం చేయల్సిన పరిస్థితి. రోగుల ప్రాణాలు కాపాడటం కన్నా, ఎప్పుడు పేషెంట్స్ మీద పెచ్చులు ఊడి పడుతాయో అన్న భయం ఇటు వైద్యులను, అటు రోగులను వెంటా డుతోంది. రోజు రోజుకూ పెరుగుతున్న రోగుల తాకిడికి ఉస్మానియా హస్పిటల్ ప్రధాన భవనం నుంచి ఇతర బ్లాక్ లకు అన్ని డిపార్ట్ మెంట్లను తాత్కాలికంగా మార్చి వైద్యం అందిస్తున్నా, రోగులకు సరైన వాతావరణంలో చికిత్స కల్పించ లేకపోతున్నారు. వైద్యం అందించడమే కాక వైద్యవిద్య బోధన ప్రాక్టీస్ చేసే వైద్య విద్యార్దులకు సరైన సౌకర్యాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. దీనికి తోడు ప్రతిరోజు వేల సంఖ్యలో వచ్చే రోగులకు వైద్యం అందించేందుకు డాక్టర్లు సిద్దంగా ఉన్న ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు.? నూతన బిల్డింగ్ నిర్మాణం వెంటనే చేపట్టాలని దర్నాలు చేసిన సందర్భాలు లేకపోలేదు.
హైదరాబాద్ మహానగరం నుంచి వచ్చే రోగులు మాత్రమే కాదు. తెలంగాణ తో పాటు సరిహద్దు రాష్ట్రాల ప్రజలకు పెద్దాసుపత్రి ఉస్మానియానే దిక్కు. ముఖ్యంగా తెలంగాణ లో పెద్దాస్పత్రులు గాంధీ ఉస్మాని య లే. పేదలకు ఆరోగ్యం నయం చేసే ఈ ప్రభుత్వ ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలిపో తుందో తెలియని స్థితి. ఇతర బ్లాక్ లకు అన్ని విభాగాలను తరలించడంతో స్వచ్ఛమైన గాలి, వెలుతురు లేకుండా ఇరుకిరుకుగా వార్డులు మారాయి. దీంతో రోగులు ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. మరో వైపు చికిత్స అందించే వైద్యులు మాస్క్ లు, చేతులకి వేసుకునే గ్లౌజ్‍లు, డాక్టర్ల యూనిఫాంలు ధరించే సమయంలో ఉక్కపోత తో ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రిలో గాలి, వెలుతురూ లేక వైద్యులు ఇబ్బందులు పడుతున్నారు. చికిత్స చేయించుకునే పేషెంట్స్ కూడా చికాకుగా హస్పిటల్ లో గడపల్సి వస్తోంది. ఒకప్పుడు గొప్ప ఆసుపత్రిగా వెలుగొందిన ఉస్మానియా ఆసుపత్రి భవనం చివరి దశకు చేరు కుంది. ఎన్నో రికార్డులు కైవసం చేసుకున్న ఉస్మానియా దవాఖానా ఈరోజు ముక్కి మూలుగుతోంది. ఎక్కడ చూసిన పగుళ్లు, బీటలు పెచ్చులూడి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చికిత్స అందిస్తున్న భవనల నిర్మాణం 1970-80 మధ్య చేపట్టినవే కావడంతో వర్షాలకు నీరు వార్డులలోకి ఇంకడం సీలింగ్ పెచ్చులు ఊడిపోవడం జరుగుతున్నాయి. దీంతో ఎప్పుడు పైకప్పు ఊడి మీద పడుతుందో అన్న భయం రోగులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రస్తుతం ఉస్మానియాలో చికిత్స అందిస్తున్న భవనాలు ఒవర్ లోడ్ తో ఇక తన వల్ల కాదు అన్నట్లు దీనంగా చూస్తున్నాయి.
ఇక ఉస్మానియా చరిత్ర విషయానికి వస్తే, నిజాం నవాబు పరిపాలనలో1866లో దవాఖానా నిర్మాణం జరిగింది. ఒకప్పుడు సంపన్నులకు మాత్రమే వైద్య సేవలు అందించే ఆసుపత్రి తర్వాత పేదల దవా ఖానా గా మారింది. అప్జల్ గంజ్ ఆసుపత్రిగా పేరుపొందిన అసుపత్రి సరిగ్గా 1908 సెప్టెంబర్ 28న మూసీ కి వచ్చిన వరదల్లో నేల మట్టం అయింది. ఆ తర్వాత చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆదేశాలతో అప్పటి వరకు ఉన్న ఉస్మానియా ఆసుపత్రికి సమీపంలో 1919లో హస్పిటల్ బిల్డింగ్ నిర్మాణం వరదలకు తట్టుకునేలా ఎత్తులో నిర్మాణం చేశారు. సుమారు 26.5 ఎకరల భూమిలో బ్రిటిష్ – ఇండియా ఆర్కిటెక్ట్ విన్సెంట్ జెరోమ్ ఎస్చ్, నవాబ్ ఖాన్ బహదూర్ మీర్జా అక్బర్ బేగ్ బ్రిటిష్ – ఇండియా నిర్మాణ శైలిలో చేపట్టారు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరు మీదుగా దీనికి ఉస్మానియ హాస్పిటల్ అని పేరు పెట్టారు. అప్పట్లోనే దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న ఉస్మానియా పూర్వ వైభోగంకు నూతన బిల్డింగ్ నిర్మాణం మాత్రమే పరిష్కారం అంటున్నారు రోగులు. పాత బిల్డింగ్ నుంచి కూలీకుతుబ్ షా భవనం లోకి తరలించారు. ఆ భవనానికి వారసత్వ సంపద హోదా ఉండటంతో కూల్చేందుకు అడ్డంకిగా మారింది. మరో వైపు వైద్యశాఖ అందుబాటులో ఉన్న 7 ఎకరాలలో నూతన భవనం నిర్మాణం చేపట్టాలని ఆలోచించినా పూర్వపు భవనాన్ని మించి ఎత్తు నిర్మించకుండ దన్న షరతు దీనికి అడ్డంకిగా మారింది.
నూతన భవన నిర్మాణ ప్రతిపాదన 2010లో రోశయ్య హయంలోనే వచ్చింది. ఆ ప్రభుత్వం అనేక కమిటీలు వేసి, 200 కోట్ల నిధులను కేటాయిస్తూ జీవో కూడా విడుదల చేసినా, వివిధ కారణాలతో మధ్యలోనే ఆగిపోయింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసిఆర్ సర్కార్ ఉస్మానియా ఆస్పత్రి మీద దృష్టి పెట్టారు. 2015 జులైలో కేసిఆర్ స్వయంగా హాస్పిటల్ ను సందర్శించి పురాతన భవనాన్ని కూల్చి నూతన భవనాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొందరు వారసత్వ కట్టడాలను పరిరక్షించాలని కోర్టుకు వెళ్ళడం తో కోర్టు స్టే విధించింది. అనంతరం జేఎన్ టీయూ ఇంజనీర్ల బృందం ఉస్మానియా ఆస్పత్రి భవనం మీద అథ్యయనం చేసి, భవనం పనికిరాడని, మరమ్మతులు చేసినా కనీసం ఐదు సంవ త్సరాల కన్నా ఎక్కువ ఉండదని చెప్పారు. ఆ తరువాత కొందరు హైకోర్టును ఆశ్రయించి ప్రస్తుత నిర్మాణం కూల్చవద్దని కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో కోర్టు స్టే ఇచ్చింది, 2023 జూలై 3న సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఉస్మానియా హాస్పిటల్ నూతన నిర్మాణ అంశంపై హాస్పిటల్ పరిధిలోని ప్రజా ప్రతినిధుల సమావేశంలో పాత భవనాలు తొలగించి కొత్త భవన నిర్మాణాలు చేపట్టాలని అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తిసుకువెళ్లేందుకు ఉస్మానియా జనరల్ హస్పిటల్ అసోసియేషన్ ఆధ్వర్యం లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరైయ్యారు. అనేక విషయాలు చర్చిం చారు. ఉస్మానియా పాత బిల్డింగ్ కూల్చి అదే స్థలంలో నూతన భవనం నిర్మాణం అదే అకృతిలో చేపడి తే, బాగుంటుందన్న అభిప్రాయనికి వచ్చారు.
ఏళ్లు గడుస్తున్నా నూతన భవన నిర్మాణం పక్రియ అడుగు ముందుకు పడటం లేదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నూతన భవనం నిర్మాణం చేపడుతామని వైద్యులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం పాత భవనం స్థానే కొత్త ఆసుపత్రి కడుతుందా.? లేక గోషామాహల్ పోలీస్ గ్రౌండ్స్ లో కడుతుందా. లేక నగర శివారులో మరింత విశాలమైన భవనాలను నిర్మించి ఆసుపత్రి విస్తరిస్తుందా చూడాలి. గత ప్రభుత్వాల మాదిరి ఉస్మానియా నయా భవనం నిర్మాణం తాత్సరం చేస్తుందో లేక కాంగ్రెస్ ప్రభుత్వం ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం మీద ఎంత చిత్తశుద్ధితో వేగంగా అడుగులు వేస్తుందో చూడాలి.


