మల్లారెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం.. కాంగ్రెస్‌ లేదా బీజేపీలోకి?

మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పార్టీ మారడం దాదాపు ఖరారు అయిందా…? అందుకే గులాబీ పార్టీకి దూరంగా ఉంటున్నారా…? బిఆర్ఎస్ అధిష్టానం సైతం మల్లారెడ్డిని లైట్ తీసుకుందా…? తాజాగా మాజీ మంత్రి చేసిన కామెంట్స్ దేనికి సంకేతం.? ఇంతకు దీనిపై గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది…?

చామకూర మల్లారెడ్డి బిజినెస్‌మెన్ కమ్ పొలిటీషియన్. 2014 లో రాజకీయ అరంగ్రేటం చేసిన మల్లారెడ్డి టీడీపీ నుంచి మల్కాజిగిరి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి గెలిచి కేసీఆర్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. ప్రస్తుతం మల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2023లో మల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినా బిఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చింది. దీంతో అప్పటి నుంచి మల్లారెడ్డి రాజకీయంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒకానొక సందర్భంలో మల్లారెడ్డి పార్టీ మారతారని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ లేదా బీజేపీలో మల్లారెడ్డి చేరతారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపించింది. కానీ మల్లారెడ్డి మాత్రం ఎప్పటికప్పుడు పార్టీ మార్పు అంశాన్ని ఖండిస్తూ వచ్చారు.

పాలిటిక్స్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి పాలిటిక్స్ లోకి రాకముందు వ్యాపారవేత్తగా ఉన్నారు. ఆయనకు విద్యా సంస్థలు, ప్రయివేటు యూనివర్సిటీలు ఉన్నాయి. తాజాగా దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ఏఐ యూనివర్సిటీలు నెలకొల్పడంపై ఫోకస్ పెట్టారు. అందుకే మల్లారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే మల్లారెడ్డి సందర్భం వచ్చినప్పుడల్లా పొలిటికల్‌గా కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ అవుతుంటారు. కానీ ప్రస్తుతం మల్లారెడ్డి పూర్తిగా వ్యాపారాల పైనే దృష్టి పెట్టినట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు మేడ్చల్ నియోజకవర్గ బిఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ ఎప్పుడు ఉంటుంది అనే దానిపై క్లారిటీ లేదు. అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఎస్.ఐ.ఆర్ పై సభలు నిర్వహిస్తున్నారు. కానీ మేడ్చల్ లో మాత్రం ఆ ఊసే లేదు. దీంతో మరోసారి మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహార శైలి పొలిటికల్ గా చర్చనీయాంశం అయింది.

తాజాగా ఒక కార్యకర్త జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. తాను బిఆర్ఎస్ పార్టీకి దూరమవుతున్నానని … తనను మర్చిపోతున్నారని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.ఈ వీడియో వైరల్ అయింది. దీంతో మల్లారెడ్డి పార్టీ మార్పు ఖాయం అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి గతంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. ప్రీతి రెడ్డి బీజేపీలో చేరి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేస్తారని గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే మల్లారెడ్డి మాత్రం బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని సందర్భం వచ్చినప్పుడల్లా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక మల్లారెడ్డి వ్యవహార శైలితో బిఆర్ఎస్ అధిష్టానం సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తుందట. మల్లారెడ్డిని లైట్ తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి నియోజకవర్గ SIR సభకు కేటిఆర్ హాజరయ్యారు. కానీ మేడ్చల్ నియోజకవర్గంలో ఎస్.ఐ.ఆర్ మీటింగ్ ను ఏర్పాటు చేయలేదు. దేశ వ్యాప్తంగా తన విద్యా సంస్థలను నెలకొల్పాలని భావిస్తున్న మల్లారెడ్డి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోను యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నారు. వాటికి సంబంధించిన అనుమతులను పొందాల్సి ఉంటుంది. దీంతో మల్లారెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా తన యూనివర్సిటీలో మోదీతో ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి భావించారు. కానీ మోదీ బిజీ షెడ్యూల్ కారణంగా అటెండ్ కాలేదు. ప్రస్తుతం గులాబీ పార్టీలో అంటీముట్టనట్లు ఉంటున్నారు. మొత్తానికి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కారు దిగి కమలం గూటికి చేరతారా లేదా కారు పార్టీలోనే కంటిన్యూ అవుతారా అనేది చూడాలి.

Latest Articles

నాని లైనప్ మారిందా..?

నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్