అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జంక్షన్ వద్ద తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ట్రావెల్స్ బస్సులో ఆకస్మిక మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో.. ప్రయాణికులకు ఏం కాలేదు. భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తున్న శ్రీ తులసి ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.బస్సు రేగుపాలెం జంక్షన్‌కు రాగానే ఫైర్ సేఫ్టీ అలారం మోగడంతో అప్రమత్తమైన డ్రైవర్ ఇంజిన్‌లో మంటలను గమనించి వెంటనే బస్సును నిలిపివేశాడు. దీంతో బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, ఒక హెల్పర్ అత్యవసర ద్వారం గుండా సురక్షితంగా కిందకు దిగారు. సమాచారం అందుకున్న హైవే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 10 నిమిషాల్లోనే ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
ట్రావెల్స్ బస్సులో మంటలు.. తప్పిన ప్రమాదం
0
40
Latest Articles
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -
- Advertisement -


