ట్రావెల్స్ బస్సులో మంటలు.. తప్పిన ప్రమాదం

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జంక్షన్ వద్ద తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ట్రావెల్స్ బస్సులో ఆకస్మిక మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో.. ప్రయాణికులకు ఏం కాలేదు. భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తున్న శ్రీ తులసి ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.బస్సు రేగుపాలెం జంక్షన్‌కు రాగానే ఫైర్ సేఫ్టీ అలారం మోగడంతో అప్రమత్తమైన డ్రైవర్ ఇంజిన్‌లో మంటలను గమనించి వెంటనే బస్సును నిలిపివేశాడు. దీంతో బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, ఒక హెల్పర్ అత్యవసర ద్వారం గుండా సురక్షితంగా కిందకు దిగారు. సమాచారం అందుకున్న హైవే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 10 నిమిషాల్లోనే ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

Latest Articles

రూటు మార్చిన క్రేజీ బ్యూటీ..

ఇండస్ట్రీలో ఎవరి కెరీర్ ఎలా టర్న్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక్కోసారి కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసినా.. ఊహించని విధంగా మళ్లీ స్టార్ట్ అవుతుంటుంది. ఎప్పుడూ ఊహించని క్రేజీ ఆఫర్స్ వస్తుంటాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్