మీనాక్షి విషయంలో ఎవరు స్పందించారో అందరికీ తెలుసునని.. రాష్ట్ర కాంగ్రెస్ నుంచే సమాచారం వెళ్లిందని బీజేపీ మంత్రి చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ సమాచారం మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలకు చేరిందని చెప్పారు. మీనాక్షి విషయంలో ఈసీ పక్షపాతంతో వ్యవహరించిందని.. మీనాక్షికి కాంగ్రెస్ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. తెలంగాణను సీఎం రేవంత్ నాశనం చేస్తున్నారన్న కేటీఆర్.. రేవంత్ సర్కార్ తీరుపై అభ్యంతరాలున్నాయన్నారు. ఫ్యూచర్ సిటీ ఊహాజనిత నగరంలో ఊగుతున్నారని ఎద్దేవా చేశారు.
జీహెచ్‌ఎంసీని నిర్వీర్యం చేశారని విమర్శించారు. బీఆర్‌ఎస్ సభ్యత్వాల కోసం యాప్ తీసుకొస్తున్నామని కేటీఆర్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్న కేటీఆర్.. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బీజేపీతోనే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అడుగంటి పోతోంది..అందుకే తమ పోటీ బీజేపీతోనే ఉంటుందని స్పష్టం చేశారు.


