టీటీడీలో 60 ఇంజనీరింగ్ పోస్టుల భర్తీలో భారీ అక్రమాలు జరిగాయని మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 27 ఏఈఈ, 10 ఏఈ, 19 ఏటీఓ, 4 జేఈ పోస్టుల భర్తీకి 2023 నవంబర్‌లో జగన్ ఆదేశాలతో నోటిఫికేషన్ ఇచ్చామని, 30 వేల మంది దరఖాస్తు చేశారని భూమన తెలిపారు. రాయలసీమకు ప్రత్యేక కేటాయింపులు లేక లీగల్ సమస్యలు వస్తాయని తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చైర్మన్ బీఆర్ నాయుడు ఈ ఏడాది మేలో అదే నోటిఫికేషన్ ఇచ్చారని, దీని వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. సెంటర్లు మార్చడంతో కేవలం 18 వేల మందే పరీక్షకు హాజరయ్యారన్నారు. చైర్మన్, ఇద్దరు సభ్యుల సహకారంతో ఒక్కో పోస్టు రూ.30 నుంచి 40 లక్షలకు అమ్ముకున్నారనే చర్చ జరుగుతోందని భూమన సంచలన ఆరోపణ చేశారు. రాష్ట్రాన్ని ఒకే జోన్‌గా చేసి రాయలసీమకు అన్యాయం చేశారని, 2024-25 బ్యాచ్‌కు అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. మద్రాస్ ఐఐటీతో పారదర్శకంగా చేద్దామనుకుంటే ఇప్పుడు డబ్బుల కోసం పోస్టులు అమ్ముతున్నారని విమర్శించారు.
టీటీడీ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీలో అక్రమాలు.. భూమన సంచలన ఆరోపణలు
0
71
Previous article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


