మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. 8 వేల మహిళా భవనాలకు వర్చువల్‌గా సీఎం రేవంత్ శంకుస్థాపన చేశరు. స్వయం సహాయక సంఘాల కోసం మహిళా భవనాలు నిర్మిస్తున్నారు. ఆడబిడ్డల అండతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం నిలబడుతుందని చెప్పారు, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో.. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీకి బస్సులు రెంటల్ పద్ధతిలో ఇస్తున్నామని అన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మహిళలను భాగస్వాములు చేశామన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో గోడౌన్లు నిర్మిస్తామన్నారు. ఇందుకోసం పట్టణాల్లో భములు ఇప్పిస్తామని చెప్పారు.
నామమాత్రపు అద్దెలతో భూములను లీజుకు ఇస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
8 వేల మహిళా భవనాలకు వర్చువల్‌గా సీఎం రేవంత్ శంకుస్థాపన
Latest Articles
- Advertisement -


