ఈడీ నోటీసులపై ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. తన సతీమణికి నోటీసులంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ కంపెనీకి మాత్రమే ఈడీ నోటీసులు ఇచ్చారని.. లిక్కర్ స్కామ్ కేసుతో సంబంధం లేదని అన్నారు. రాజ్ కసిరెడ్డితో వ్యాపార సంబంధాలున్న వారందరికీ నోటీసులు ఇచ్చారని.. సైట్ డెవలప్‌మెంట్‌లో రూ.35 లక్షల లావాదేవీలు జరిగాయని చెప్పారు.
రాజ్ కసిరెడ్డితో వ్యక్తిగత లావాదేవీలు లేవని అన్నారు. ఈడీ నోటీసులకు సమాధానం ఇస్తామని.. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు కేశినేని చిన్ని
నా సతీమణికి నోటీసులంటూ తప్పుడు ప్రచారం- కేశినేని చిన్ని
Latest Articles
- Advertisement -


