ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ మాటమార్చారని మాజీ మంత్రి హరీష్‌రావు ఫైరయ్యారు. 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పి..
ఇప్పుడు 70 లక్షల మెట్రిక్ టన్నులే కొంటామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంపై నెపం నెట్టడం కాదు.. కేంద్రం మెడలు వంచాలని చెప్పారు. మొక్కజొన్న రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందలేదన్నారు. ఒకట్రెండు రోజుల్లో మార్పు రాకపోతే..కలెక్టరేట్ ఎదుట నిరవధిక ధర్నా చేస్తామని హెచ్చరించారు. వేల మంది రైతులతో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లను దిగ్భంధిస్తామని హరీష్‌రావు అన్నారు.
ధాన్యం కొనుగోళ్లపై ఉత్తమ్ మాటమార్చారు- హరీశ్‌రావు
Latest Articles
- Advertisement -


