ఎల్లమ్మగా నటించే బ్యూటీ ఫిక్స్ అయ్యిందా..?

ఎల్లమ్మ.. ఈ సినిమాలో నటించే కథానాయిక ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది. ఈ మూవీలో హీరోయిన్ ఫిక్స్ అంటూ పుకార్లు.. షికారు చేస్తున్నాయి కానీ.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావడం లేదు. ఇప్పటి వరుకు ముగ్గురు హీరోయిన్స్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ.. కన్ ఫర్మ్ కాలేదు. తాజాగా ఓ కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది. ఓ క్రేజీ హీరోయిన్.. ఓ క్రేజీ యాక్టర్ పేరు గట్టిగా వినిపిస్తుంది. ఇంతకీ.. ఎవరా ఇద్దరు..? అసలు ఎల్లమ్మ సినిమా తెర వెనుక ఏం జరుగోతుంది..?

బలగం సినిమా తర్వాత నుంచి డైరెక్టర్ వేణు ఎల్లమ్మ కథ పై కసరత్తు చేస్తూనే ఉన్నారు. అయితే.. ఈ మూవీలో ఎల్లమ్మగా నటించే కథానాయిక ఎవరు అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. కీర్తి సురేష్, సాయిపల్లవి.. ఈ ఇద్దరు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఆతర్వాత ఈ ఇద్దరూ నో చెప్పారని తెలిసింది. లేటెస్ట్ గా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ పేరు వార్తల్లో నిలిచింది. పర్ ఫార్మెన్స్ స్కోప్ ఉన్న ఎల్లమ్మ పాత్రకు మృణాల్ అయితే పర్ ఫెక్ట్ అని టాక్ వినిపించింది. ఇక ఈ బ్యూటీ నటించడం కన్ ఫర్మ్ అనుకుంటే.. ఇప్పుడు ఈ భామ కూడా నో చెప్పిందనే వార్త బయటకు వచ్చింది.

లేటెస్ట్ గా ఇద్దరు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు ఎవరంటే.. వైవిధ్యభరితమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నారని సమాచారం. ఆయన పాత్ర చుట్టూ కథలోని ప్రధాన మలుపులు ఉంటాయని తెలిసింది. ఇక హీరోయిన్ ఎవరంటే.. మమిత బైజు పేరు ప్రచారంలోకి వచ్చింది. ఈ మలయాళ ముద్దుగుమ్మ ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ బ్యూటీతో చర్చలు జరుపుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మమిత క‌నుక‌ ఓకే చెబితే ఈ ప్రాజెక్ట్‌ పై అంచనాలు మరింత పెరగడం ఖాయం.

అయితే.. ఎల్లమ్మ పాత్రలో నటించే హీరోయిన్ ఎవరు అనేది కన్ ఫర్మ్ కాకపోయినా.. షూటింగ్ స్టార్ట్ చేశారు. మిగిలిన యాక్టర్స్ తో షూటింగ్ చేస్తున్నారని టాక్. ఇక కథ విషయానికి వస్తే.. గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ మూవీలో గ్రామీణ సంస్కృతి, నమ్మకాలు.. ఒక నిర్దిష్టమైన ప్రాంతంలోని సామాజిక పరిస్థితుల ఆధారంగా ఈ కథ నడుస్తుందని ఇండస్ట్రీ టాక్. బలగం సినిమా ఎలాగైతే.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందో.. ఈ సినిమా అంతకు మించి అనేలా ఉంటుందని.. అందర్నీ ఆకట్టుకుంటుందని టీమ్ నమ్మకంగా చెబుతున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తుండడంతో మరింత క్రేజ్ ఏర్పడింది. త్వరలోనే ఈ మూవీలో నటించే ఎల్లమ్మ ఎవరు అనేది ప్రకటించనున్నారని సమాచారం. దసరాకి ఈ సినిమాను రిలీజ్ చేయాలనేది ప్లాన్. మరి.. ఎల్లమ్మ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Latest Articles

2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు

2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు కొనసాగింది. నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.6.51 లక్షల కోట్లు కాగా... ఇది గతేడాదితో పోలిస్తే 16.4 శాతం వృద్ధి రేటు నమోదైంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్