కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ప్రభుత్వం సోమవారం అధికారంలోకి వచ్చింది. సతీశన్( V D Satheesan) కేరళ ముఖ్యమంత్రిగా తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో(Central Stadium) జరిగిన కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేశారు. కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్(Rajendra Vishwanath Arlekar) ఆయనతో పాటు 20 మంది మంత్రులతో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే( Mallikarjun Kharge), కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ(Rahul Gandhi),ప్రియాంక గాంధీ( Priyanka Gandhi Vadra) హాజరయ్యారు. వయనాడ్ ఎంపీగా ఉన్న ప్రియాంక గాంధీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సతీశన్ పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న VIP కల్చర్‌కు ముగింపు పలుకుతూ, తాను కేవలం ఒక పైలట్ వాహనం , ఒక ఎస్కార్ట్ కారుతో మాత్రమే ప్రయాణిస్తానని తెలిపారు. ఇకపై సీఎం కాన్వాయ్‌లో భారీ భద్రతా వాహనాలు, అంబులెన్స్‌లు ఉండవని స్పష్టం చేశారు.
అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి మంత్రుల కోసం కొత్త లగ్జరీ కార్లు కొనుగోలు చేసే పద్ధతిని కూడా రద్దు చేశారు. గత ప్రభుత్వంలో ఉపయోగించిన వాహనాలనే కొనసాగించాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఖర్చు తగ్గింపు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
మంత్రివర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు Ramesh Chennithala, K Muraleedharan, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు Sunny Joseph చోటు దక్కించుకున్నారు. అలాగే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) నుంచి PK Kunhalikutty, PK Basheer, N Samsudheen, KM Shaji, VE Abdul Gafoor మంత్రులయ్యారు.
కేరళ అసెంబ్లీ స్పీకర్‌గా తిరువంచూర్ రాధాకృష్ణన్( Thiruvanchoor Radhakrishnan) ను నియమించగా, డిప్యూటీ స్పీకర్‌గా షానిమోల్ ఉస్మాన్( Shanimol Usman) బాధ్యతలు చేపట్టనున్నారు.
140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో UDF కూటమి 102 సీట్లు గెలుచుకుని భారీ విజయాన్ని నమోదు చేసింది. కాంగ్రెస్ పార్టీ 63 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, IUML 22 స్థానాలు గెలుచుకుంది. ఎల్‌డీఎఫ్‌కు 35 సీట్లు మాత్రమే దక్కగా, BJP మూడు స్థానాల్లో విజయం సాధించింది.
మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్( Pinarayi Vijayan) కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్( Rajeev Chandrasekhar) కూడా వేదికపై కనిపించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మొదట కేసీ వేణుగోపాల్( KC Venugopal) ను సీఎం పదవికి పరిశీలించినప్పటికీ, ప్రజల మద్దతు మరియు IUML మద్దతుతో చివరకు సతీశన్‌కు అవకాశం లభించింది. ఈ వ్యవహారంలో సోనియా గాంధీ( Sonia Gandhi)మాజీ సీఎం AK Antony మధ్య జరిగిన చర్చ కీలకమైంది.


