నారా దేవాంశ్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభం

మంత్రి నారా లోకేశ్( Nara Lokesh) తనయుడు దేవాశ్ నారా(Devansh Nara) డీనో డీట్స్( ‘Dino Deets’ ) పేరుతో కొత్త యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా, నందమూరి కుటుంబ సభ్యులు దేవాంశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న లోకేశ్‌.. యూట్యూబ్‌, పాడ్‌కాస్ట్‌ల ప్రత్యేకతలను తెలుసుకున్నారు.

డైనోసార్లు, శిలాజాలు, పురాతన అవశేషాల గురించి తాను తెలుసుకున్న ఆసక్తికరమైన విషయాలను సరదాగా, ఆలోచింపజేసేలా దేవాంశ్‌ ఈ ఛానల్‌ ద్వారా ప్రేక్షకులతో పంచుకోనున్నారు. “దేవాంశ్‌ సృష్టించిన ప్రాచీన ప్రపంచంలోకి ఓ ప్రేక్షకుడిలా ప్రవేశించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అంటూ లోకేశ్‌ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు.

ఇప్పటికే చదరంగంలో తన ప్రతిభను చాటుకున్న దేవాంశ్‌, క్లిష్టమైన 175 చెస్‌ ఫజిల్స్‌ను వేగంగా పరిష్కరించి ‘Fastest Checkmate Solver’గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. ‘5334 Problems and Games’ పుస్తకంలోని 175 సంక్లిష్ట చెక్‌మేట్‌ ఫజిల్స్‌ను గత ఏడాది రికార్డు సమయంలో పూర్తి చేసి ఈ ఘనత సాధించారు.

Latest Articles

ఏళ్ల పాటు గ్యాంగ్ రేప్, బ్లాక్ మెయిల్..చివరకు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య.. జోధ్ పూర్ లో దారుణం

రాజస్థాన్ లోని (Rajasthan) జోధ్ పూర్( Jodhpur) గ్రామీణ ప్రాంతంలో ఇద్దరు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపాయి. గ్యాంగ్‌రేప్‌, బ్లాక్‌మెయిల్‌ ఆరోపణలతో ఇప్పటికే మార్చిలో అక్క ఆత్మహత్య చేసుకోగా.. దాదాపు రెండు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్