డీఎంకే, కాంగ్రెస్‌ మధ్య టీవీకే చిచ్చు..ఇండియా కూటమికి డీఎంకే గుడ్ బై

ఇండియా కూటమితో డీఎంకే తెగదెంపులు చేసుకుంది. డీఎంకేను కాదని టీవీకేకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పింది. లోక్‌సభలో తాము కాంగ్రెస్‌ నేతలతో కలిసి కూర్చోబోమని స్పష్టం చేసింది. లోక్‌సభలో తమ ఎంపీలకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని కోరింది. ఈ మేరకు స్పీకర్‌కు డీఎంకే లేఖ రాసింది.

తూత్తుకుడి ఎంపీ కనిమొళి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్‌తో మా కూటమి ముగిసింది. అందువల్ల లోక్‌సభలో ప్రస్తుతం కాంగ్రెస్‌ సభ్యుల పక్కన డీఎంకే ఎంపీలు కూర్చోవడం సమంజసం కాదు.. అని అన్నారు. డీఎంకే పార్లమెంటరీ పార్టీ సభ్యులకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

కాబట్టి లోక్‌సభలో డీఎంకే ఎంపీలకు తగిన సీట్లు కేటాయించాలని, ఆగస్టులో జరిగే సమావేశాల్లో ఎంపీలు తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించేందుకు సహకరించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం 22 మంది ఎంపీలతో డీఎంకే, ప్రతిపక్ష ఇండియా( INDIA)కూటమిలో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉంది. అయితే గత కొంతకాలంగా INDIA కూటమిలో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి.. ఇప్పుడు తమిళనాడు రాజకీయ పరిణామాల నేపథ్యంలో అవి తారాస్థాయికి చేరాయి.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో కాంగ్రెస్‌ పోటీ చేసినప్పటికీ, ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ పార్టీ విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం డీఎంకేకు తీవ్ర అసంతృప్తి కలిగించింది. ఈ పరిణామాన్ని డీఎంకే నేతలు ద్రోహంగా అభివర్ణిస్తున్నారు.

Latest Articles

కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు నిజంగానే కోరుకుంటున్నారా?

తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి సరికొత్త మైండ్ గేమ్‌కు తెరతీసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. కేటీఆర్, హరీశ్ రావు ద్వయం ఒక కొత్త...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్