కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగింది యువ వికాసం కాదని.. యువతకు మిగిలింది విలాపమే అని అన్నారు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి యువతను నిలువునా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు తామే ఇచ్చినట్లుగా కాంగ్రెస్ పబ్లిసిటీ చేసుకుంటుందని కేటీఆర్ మండిపడ్డారు. 55వేల 143 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కాంగ్రెస్ మాటలు చెబుతుందని విమర్శించారు. ఏడాదిలో కాంగ్రెస్ భర్తీ చేసింది కేవలం 12వేల 527 ఉద్యోగాలు మాత్రమే అని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగ నియమాక పత్రాలు ఇస్తూ గొప్పలు చెబుతున్నారని తెలిపారు.


