కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన విజయోత్సవాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.. ఇవి ప్రజాపాలన విజయోత్సవాలుకావని.. వికృత ఉత్సవాలు అంటూ మండిపడ్డారు. ఏడాది అరాచక పాలనే కాంగ్రెస్ విజయమా? అని నిలదీశారు. ప్రజల చావులు, గోసలే ఉత్సవమా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పిల్లలకు పురుగులన్నం పెట్టడం విజయమని.. వారి చావులు ఉత్సవమని, యువతకు ఉద్యోగాలివ్వకపోవడం విజయమని, వారికి సంకెళ్లేయడం ఉత్సవమని విమర్శించారు.