రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ అంటూ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. 11 మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర వీడడం లేదని విమర్శించారు. విజయనగరం, విశాఖపట్నంలో మంచి ఆస్పత్రులు ఉన్నా స్థానిక పాఠశాలలోని బెంచీలమీద చికిత్స అందించడం దారుణమన్నారు. నాణ్యమైన అత్యవసర వైద్యాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. లిక్కర్, ఇసుక స్కాంల్లో నిండామునిగిపోయిన ప్రభుత్వం ప్రజల కష్టాలను గాలికొదిలేసిందన్నారు. ఇప్పటికే 104, 108 వ్యవస్థలు దెబ్బతిన్నాయన్నాయని… ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయిందన్నారు. విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీలను నిర్వీర్యం చేశారని విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయింది – జగన్
0
149
Next article
Latest Articles
ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -
- Advertisement -


