తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 23న జరగాల్సి ఉండగా.. 26వ తేదికి వాయిదా వేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. 26న సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరుగుతుందని చెప్పారు. కేబినెట్ మీటింగ్‌లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలతో పాటు హైడ్రా ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత కల్పించడం, రెవెన్యూ చట్టం, మూసీ బాధితుల అంశం, వరద నష్టం, రైతు భరోసా తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వివరాలను సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ కేబినెట్ సమావేశం 26వ తేదీకి వాయిదా
0
247
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


