రేపు నింగిలోకి ఎస్‌ఎస్‌ఎల్వీ డీ2 వాహన నౌక

  • సూళ్లూరుపేట చెంగాలమ్మ ఆలయంలో ఇస్రో చైర్మన్‌ పూజలు
  • ఎస్ఎస్ఎల్వీ -డీ 2 ప్రయోగం విజయవంతం కావాలని పూజలు

నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట చెంగాలమ్మ ఆలయంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్‌ ప్రత్యేక పూజలు చేశారు. రేపు SSLV-D2 ప్రయోగం విజయవంతం కావాలని పూజలు నిర్వమించారు. ప్రయోగానికి ముందు ఆలయంలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
SSLV-D2 ప్రయోగానికి ఈ అర్ధరాత్రి 2.48 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. ప్రయోగానికి ముందు ఆరున్నర గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగనుంది. రేపు ఉదయం 9.18 గంటలకు SSLV -D2ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లనుంది.

ఈ ఏడాదిలో మొదటి ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోంది. వాహకనౌక ఇస్రోకు చెందిన 156.3 కిలోల బరువుగల ఈవో ఎస్-07 ఉపగ్రహంతో పాటు యూఎస్ఏలోని అంటారీస్ సంస్థకు చెందిన 11.5 కిలోల బరువు గల జూనూస్ -1, చెన్నై స్పేస్‌ కిడ్జ్ ఇండియా రూపొందించిన 8.7 కిలోల అజాది శాట్-2 కక్ష్యలోకి దూసుకెళ్లనుంది.

మార్చి నెలాఖరులో పీఎస్ఎల్‌వీ -C55 రాకెట్ ద్వారా 36 ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్‌ తెలిపారు. ఎస్ఎస్ఎల్వి -డీ 2 ప్రయోగం నేపథ్యంలో షార్‌లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. షార్ పరిసరాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Latest Articles

సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్

శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్