టీటీడీ కొత్త ఈవోగా ఐఏఎస్‌ అధికారి జె. శ్యామలరావు నియామకం

     తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఈవోగా ఐఏఎస్‌ అధికారి శ్యామలరావును నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ నిరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వు లు జారీ చేశారు.ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తిరుమల వెళ్లిన సీఎం చంద్రబాబు శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమయిందని, ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు.

  తిరుమల తిరుపతి దేవస్థానం నుండే ప్రక్షాళన మొదలుపెడతామని ప్రకటించారు.తిరుమలలో ఓం నమో వెంకటేశా యా, గోవింద నామస్మరణ తప్ప మరో నినాదమే వినపడకుండా చేస్తామని చెప్పారు. ఇక, ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. కీలకమైన అధికారుల మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావుని నియమించింది ఏపీ ప్రభుత్వం.ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విధులు నిర్వహిస్తున్న శ్యామల రావును టీటీడీ ఈవోగా నియమించింది.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్