ముగిసిన ప్రధాని మోదీ ఇటలీ పర్యటన

   జీ-7 సదస్సు నుంచి ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌కు తిరిగొచ్చారు. ఇటలీ ప్రజలు, ప్రభుత్వం వారి ఆత్మీయ ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటలీ పర్యటనలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో సహా అనేక మంది ప్రపంచ నాయకులతో మాట్లాడారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా ఆయనతో సెల్ఫీ దిగారు. గ్రూప్ ఫోటో సమయంలో మోదీ వేదిక మధ్యలో నిలబడి ఉండటం ఆకట్టుకుంది.

   అపులియాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశం చాలా ఉపయోగకరంగా ఉందని మోదీ ట్వీట్‌ చేశారు. ప్రపంచ నేతలతో సమావేశంలో పలు అంశాలపై చర్చించానని చెప్పారు. గ్లోబల్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చే ప్రభావవంతమైన పరిష్కారాలను రూపొందించడం, భవిష్యత్తు తరాలకు మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడం తమ లక్ష్యమన్నారు. ఇటలీ ప్రజలు, ప్రభుత్వం వారి సాదర ఆతిథ్యానికి ధన్యవాదాలు అంటూ మోదీ ట్వీట్‌లో రాసుకొచ్చారు.ప్రధాని మోదీ పలు దేశాధినేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. జో బిడెన్‌తోనూ సమావేశమయ్యారు. సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్రలో భారత్ సంబంధం ఉందని వాషింగ్టన్ ఆరోపించిన ఏడు నెలల తర్వాత మోడీ-బిడెన్స మావేశం జరి గింది. బిడెన్‌తో తన సమావేశం తర్వాత ప్రపంచ శ్రేయస్సును అభివృద్ధి చేయడానికి భారతదేశం, యునై టెడ్ స్టేట్స్ కలిసి పనిచేస్తామని ట్విట్టర్లో పేర్కొన్నారు.

   ఇటలీ పర్యటన తొలిరోజు కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడి మిర్ జెలెన్‌ స్కీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో కూడా ప్రధాని భేటీ అయ్యారు. జీ-7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీని ఆహ్వానించడం, వేగంగా ఎదుగుతున్న చైనాను ఎదుర్కోవడానికి పశ్చిమ దేశాల ప్రణాళికల్లో భారత్‌కు ప్రముఖ స్థానం లభిస్తోంద నడానికి సూచన. భారత్‌తో పాటు 11 అభివృద్ధి చెందుతున్న దేశాల నేతలను కూడా హాజర య్యారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్