తెలంగాణలో గొర్రెల స్కామ్‌పై ఈడీ రంగంలోకి దిగింది. మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఫోకస్ చేసింది. 700కోట్ల గొర్రెల స్కామ్‌లో కుంభకోణంపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగానే, ఈడీ ఎంట్రీ ఇచ్చింది. గొర్రెల స్కామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని, రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి సమైఖ్య ఎండీకి ఈడీ లేఖ రాసింది. భారీగా డబ్బులు చేతులు మారడం, రాజకీయ ప్రముఖుల పాత్ర ఉండడంతో PMLA యాక్ట్ కింద దర్యాప్తు ప్రారంభించింది. గొర్రెలు అమ్మిన రైతులు, లబ్ధిదారులు.. ఇద్దరి డేటాను జిల్లాల వారీగా సేకరిస్తుంది ఈడీ.


