నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం శంకరనగరంలో వైసీపి,టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా టీడీపీ శ్రేణులు గ్రామంలో సంబరా లు చేసుకుంటూ వైసిపి వర్గీయుల ఇళ్ల వద్ద టపాకా యలు పేల్చడంతో చెలరేగిన వివాదం ఘర్షణకు దారితీసింది. దీంతో వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణుల పై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తల దాడిలో ఏడుగు రికి తీవ్ర గాయాలు అయ్యాయి. నలుగురు టిడిపి, ముగ్గురు వైసీపీ కార్యకర్తలు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. మిగిలిన నలుగురికి ఆత్మ కూరు ప్రభుత్వ ఆసుపత్రికలో వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచా రించి కేంద్ర బలగాలతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.