పెంపుడు కుక్క విషయంలో తలెత్తిన వివాదంతో రెండు కుటుంబాలు పరస్పరం దాడులు చేసుకు న్నాయి. మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహ్మత్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మధు అనే వ్యక్తి కుటుంబం పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు.ఈనెల 8న పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు మధు కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయలుదేరారు. వారితోపాటు పెంపుడు కుక్క కూడా బయటకు వచ్చి, నిర్మాణంలో ఉన్న ఎదురింటి ధనుంజయ్ ఇంటి ఆవరణలోకి వెళ్లింది. కుక్కను తమపై ఉసిగొల్పారంటూ ధనుంజయ్ కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. ఈ గొడవపై రెండు కుటుంబాలు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరుసటి రోజు మధు సోదరుడు శ్రీనాథ్ కుక్కను బయటకు తీసుకెళ్తుండగా నలుగురితో కలిసి ధనుంజయ్ దాడి చేశాడు. కుక్కను ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా కొట్టడంతో అడ్డు వచ్చిన మధు కుటుంబంపై కూడా దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి చేసిన ఐదుగురిని అరెస్టు చేశారు.
పెంపుడు కుక్క విషయంలో రెండు కుటుంబాల పరస్పర దాడులు
0
438
Previous article
Next article
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


