జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ పిఠాపురానికి వచ్చారు. ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ పిఠాపురం నియోకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఉగాది పండగను అక్కడే జరుపుకోవాలని నిర్ణయించారు. జనసైనికులు, ప్రజల మధ్య ఉగాది వేడుకలను పవన్ జరుపుకున్నారు. జనసేన అధినేతకు వేదపండితులు వేద ఆశీర్వచనాలు అందించారు.
జ్వరం కారణంగా ఎన్నికల ప్రచారానికి స్వల్ప విరామం ఇచ్చిన పవన్.. మళ్లీ రంగంలో దిగారు. తనను పిఠాపురంలో గెలిపిస్తే ఇక్కడే ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని పవన్ కల్యాణ్ తన ప్రచారంలో ప్రధానంగా చెబుతున్నారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపితే పిఠాపురం అభివృద్ధిని చేసి చూపిస్తానని అంటున్నారు. తాను గెలిస్తే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానన్నారు.ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొన్నారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలినిమనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు చెప్పారు. పిఠాపురం నుండచే కూటమి విజయ కేతనం ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. క్రోధి నామ సంవత్సరంలో ప్రభత్వం స్థాపిస్తున్నామన్నారు. ఈ ఏడాది ప్రలజకు మేలు జరగాలని కోరుకున్నారు. అలాగే రాష్ట్రంలో రైతులకు , మహిళలకు మరింత ప్రోత్సహం లభించాలని ఆకాంక్షించారు.
మరోవైపు పిఠాపురంలో పవన్ కల్యాణ్‌కి కొత్త ఇల్లు రెడీ అయింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన రైతు ఓదూరి నాగేశ్వరరావు ఓ భవనాన్ని నిర్మించగా పార్టీ కార్యకలాపాల నిర్వహణ, వసతికి అనువుగా ఉండడంతో ఈ నివాసాన్ని పవన్ కళ్యాణ్ ఎంపిక చేసుకున్నారు. ఇక్కడే ఉగాది వేడుకలు జరుపుకున్నారు. ఉగాది సందర్భంగా ఇవాళే పవన్ గృహప్రవేశం చేశారు.


