ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కుంభకోణంలో భాగస్వామ్యం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. గత నెల మార్చి 15న అరెస్ట్ అయిన కవిత… తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అయితే,.. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. మధ్యంత బెయిల్‌ను నిరాకరించింది.
ఇక మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 4న వాడివేడిగా వాదనలు జరిగాయి. కవిత తరపున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించగా…కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరపున జోయబ్ హుసేన్ గట్టిగా తన వాదనలు వినిపిం చారు. ఇప్పటికే ఆమె కుమారుడి పరీక్షలు ఏడు పూర్తయ్యాయని కోర్టుకు తెలిపారు. కవిత రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి అని, అలాంటి వ్యక్తి బయటకు వస్తే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను తారుమూరు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. లిక్కర్ స్కామ్‌ను ప్లాన్ చేసిందే కవిత అని.. ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని ఆరోపించారు. గతంలో విచారించిన సమయంలో మొత్తం 10 ఫోన్లను కవిత ఇచ్చారని.. కానీ అవి మొత్తం ఫార్మాట్ చేసినవేనని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నోటీసులు ఇచ్చిన తరువాత 4 ఫోన్లను ఫార్మాట్ చేశారని ఆరోపించారు. అప్రూవర్‌ను కవిత బెదిరించారంటూ జడ్జికి కీలక ఆధారాలు సమర్పించారు. ఈ క్రమంలో కోర్టు మధ్యంతర బెయిల్ పిటి షన్ను నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. ఇక మరోవైపు కవిత రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బెయిల్‌పై వాదనలను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.
మరోవైపు కవితకు కోర్టు విధించిన 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో ఆమెను ఈ మంగళవారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ప్రధాన పాత్ర పోషించారంటూ మార్చి 15న ఆమెను ఈడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో విచారించిన అనంతరం ఆమెను తీహార్ జైలుకు తరలించారు. ఇక రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణులు నిరాశలో ఉన్నారు. రెగ్యులర్ బెయిల్‌పై అయినా తీర్పు కవితకు అనుకూ లంగా రావాలని కోరుకుంటు న్నారు. మరి కల్వకుంట్ల ఫ్యామిలీతోపాటు.. గులాబీ శ్రేణులు ఎదురుచూస్తున్నట్టు కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇస్తుందా..? కవితకు ఊరట లభించనుందా.? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


