మీడియా ముందు కన్నీరు పెట్టిన సమంత

  • భోరుమని విలపించిన సమంత
  • ఇంటర్నెట్‌లో వీడియో వైరల్

ప్రముఖ హీరోయిన్ సమంత ఇటీవల కాలంలో బయటకు రావటం బాగా తగ్గించేశారు. అడపా దడపా మాత్రమే బయటకు వచ్చి, కొద్దిసేపు గడిపి వెళ్లిపోతున్నారు. అటువంటప్పుడు సమంత ప్రకటనలు, వ్యాఖ్యల్ని అభిమానులు బాగా గమనిస్తున్నారు. తాజాగా సమంత కన్నీరు పెట్టుకొని విలపించిన ఘటన అందరినీ కలచివేస్తోంది.

అగ్రనటి సమంత.. హైదరాబాద్ లో జరిగిన త‌న తాజా మూవీ శాకుంతలం ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ద‌ర్శ‌కుడు గుణశేఖర్ మాటలకు కన్నీరు పెట్టుకున్నారు. ద‌ర్శకుడు గుణ‌శేఖ‌ర్ మాట్లాడుతూ, ‘శాకుంతలం’ సినిమాలో ముగ్గురు హీరోలు ఉన్నారు. కథకి నాయకుడిగా దేవ్ మోహన్ హీరో అయితే సినిమాకి హీరో సమంత. సినిమా వెనుక హీరో దిల్ రాజు. ఈ సినిమా క్రెడిట్ మాత్రం దిల్‌రాజుగారికి ఇస్తున్నాను” అంటూ ఒక్కసారిగా ఆయన ఎమోషనలై క‌న్నీరు పెట్టుకున్నారు. దీంతో సమంత సైతం భావోద్వేగానికి గురై క‌న్నీటి ప‌ర్య‌త‌మ‌య్యారు. ఒక్కసారిగా అభిమానానికి చలించిపోయిన సమంత కన్నీరు పెట్టుకొన్నారు.

సమంత కన్నీరు పెట్టుకొన్నవిషయం కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిమీద నెట్టింట అభిమానులు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. సమంతకు అండగా ఉంటామని కామెంట్స్ చేస్తున్నారు.

Latest Articles

హీరో విజయ్‌ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు

హీరో విజయ్‌ దేవరకొండకు తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్‌ను ప్రమోట్‌ చేయడంపై నోటీసులు ఇచ్చింది.  HCA టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్