రాత్రికి రాత్రే కబ్జా స్థలంలో నిర్మాణం ….రిజిస్ట్రేషన్

     మేడ్చల్‌ జిల్లాలో భూ కబ్జాదారులు రెచ్చిపోయారు. కోట్లాది రూపాయల విలువైన కాలనీ పార్కు స్థలంపై కన్నేసారు. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తూ, మామూళ్ల మత్తులో జోగుతోం ది. మేడ్చల్ మున్సిపాల్టీ పరిధిలోని సాయి శ్రీ నిలయ వెల్పేర్ సొసైటీ స్థలంపై కన్నేసిన భూ కబ్జా దారులు ఏకంగా ప్రహరీ గోడను నిర్మించేసారు. ఈ కబ్జా వెనుక అధికార పార్టీ నేత హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్కు స్థలాన్ని కాపాడాలంటూ మున్సిపల్ అధికారుల దృష్టికి కాలనీ వాసులు తీసుకె ళ్లినా ఫలితం లేకుండా పోయింది.

    ఆరేళ్ల క్రితం సాయి శ్రీ నిలయ వెల్ఫేర్ సోసైటీ పేరిట సర్వే నెంబర్ 873, 882లలో 2015లో 256 ప్లాట్లతో లే అవుట్‌ వేసారు. 1970 గజాల స్థలాన్ని పార్క్ కోసం కేటాయించారు. అయితే ఈ స్థంలోని 400 గజాల స్థలాన్ని అక్రమించుకొని ప్రీ కాస్ట్ వాల్ నిర్మాణానికి పూనుకున్నారు కబ్జాదారులు. ఇదే విషయాన్ని మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులకు కాలనీవాసులు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దీంతో నిమ్మ కు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరును నిరసిస్తూ కాలనీవాసులు పార్కు స్థలం వద్ద ఆందోళన చేపట్టారు.

    ట్విస్ట్‌ ఏమంటే…రాత్రికి రాత్రే నిర్మాణం చేపట్టిన పార్క్ స్థలాన్ని అక్రమ పద్దతిలో ముగ్గురు పేరిట రిజిస్ట్రేషన్ చేసేశారు. మూడు డాక్యుమెంట్లు మారినట్లు సమాచారం. మంచిర్యాలకు చెందిన కౌన్సిలర్ దీన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. భూ కబ్జాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న సీఎం రేవంత్ పార్క్ స్ధలాన్ని కాపాడాలని కోరుతున్నారు కాలనీవాసులు.

Latest Articles

నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ

మేడ్చల్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్