ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

     కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నందిత తండ్రి స్వర్గీయ సాయన్నతో తనకు సన్నిహిత సంబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం… ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికం గా మరణం చెందడం అత్యంత విషాదకరం అని సీఎం అన్నారు. నందిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ… ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.

బీఆర్ఎస్ నేతలు సంతాపం తెలిపారు. లాస్య నందిత మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని తన విచారం వ్యక్తం చేశారు. కష్టకాలంలో వారి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా వుంటుందన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. లాస్య దుర్మరణంపై కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చాల మంచి నాయకురాలిగా ఉన్న యువ శాసనసభ్యురాలిని కోల్పోవడం తీవ్ర నష్టం అని కేటీఆర్ ట్వీట్ చేశారు. క్లిష్ట సమయంలో ఆమె కుటుంబం సభ్యులకు సంతాపం తెలిపారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందటం ఎంతో బాధాకరం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆస్పత్రికి వెళ్లిన నందిత కుటుంబ సభ్యులను హరీశ్ రావు పరామర్శించారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాస్య నందిత రోడ్డు ప్రమాదం లో మృతి చెందడం పట్ల మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిన్న వయసులో శాసనసభ్యురాలిగా ప్రజా మన్ననలతో ఎన్నికయిన ఆమె అర్దాంతరంగా మృతి చెందడం శోచనీయమన్నారు. ఆమె మరణం పట్ల ఆయన సంతాపం ప్రకటిస్తూ శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సానుభూతి తెలిపారు.కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల తీవ్రదిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. వారి కుటుంబానికి ప్రగాఢ సానుబూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. సాయన్న తనకు మంచి మిత్రుడని, ఆయన చనిపోయిన బాధ నుండి కోలుకోకముందే చిన్నవయసులోనే లాస్య మరణించడం బాధాకర మన్నారు.

Latest Articles

సింగరేణి స్కాం బయటపడటంతో డైవర్షన్‌- రామచందర్ రావు

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఫణికుమార్‌ బీజేపీలో చేరారు. ఆయనను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు. ఈ సందర్భంగా మాట్లాడిన రామచందర్‌రావు... రేవంత్‌ రెడ్డిపై ఫైరయ్యారు. సీఎం రేవంత్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్