విద్యుత్‌ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

     రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగితే అందుకు బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠినచర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అలాంటి వారిని అవసరమైతే సస్పెండ్‌ చేస్తామన్నారు. విద్యుత్తు సరఫరాపై ఆయన సచివాలయంలో ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వానికి చెడ్డపే రు తెచ్చేందుకు, విద్యుత్తుపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సీఎం చెప్పారు. బీఆర్ఎస్‌ హయాంలో నియ మితులైన కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేం దుకు ఉద్దేశపూర్వకంగా కోతలు పెడుతున్నారనే సమాచారం తమకు ఉందని తెలిపారు. గతంతో పోల్చితే విద్యుత్తు సరఫరా పెంచినా.. కోతలు పెడుతున్నారంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మీపైనే ఉందని అధికారుల ను అప్రమత్తం చేశారు. ప్రస్తుత అవసరాలకు సరిపడా కరెంటు సరఫరా చేస్తున్నామని, కోతలు విధించేలా ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని సీఎం స్పష్టం చేశారు.

      ఇటీవల రాష్ట్రంలోని 3 సబ్‌స్టేషన్లలో కొంతసేపు సరఫరాకు అంతరాయం కలగడానికి కారణా లేమిటని సీఎం ప్రశ్నిం చగా.. లోడు హెచ్చుతగ్గులను డీఈలు సరిచూసుకోకపోవడంతో సమస్య తలెత్తిం దని అధికారులు తెలిపారు. అలా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సాంకేతిక, ప్రకృతిపరమైన కారణాలు మినహా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కోతలకు కారణమైతే ఉపేక్షించవద్దని ఆదేశించారు. మరమ్మతులు, సాంకేతిక సమస్యలతో సరఫరా నిలిపివే యాల్సి వస్తే ముందుగానే వినియోగదారులకు సమాచారమివ్వాలని సూచించారు. గత ఏడాదితో పోల్చితే గడచిన రెండు నెలల్లో సరఫరా పెంచినట్లు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ రిజ్వీ తెలిపారు. గత ఏడాది జనవరిలో 230.54 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు సరఫరా కాగా.. ఈసారి అదే నెలలో 243.12 మిలియన్‌ యూనిట్లు సరఫరా అయిందని తెలిపారు. గతేడాది ఫిబ్రవరిలో ఒకటో తేదీ నుంచి 13వ తేదీ వరకు 242.44 మిలియన్‌ యూనిట్లు సరఫరా చేస్తే.. ఈసారి అదే వ్యవధిలో 264.95 మిలియన్‌ యూనిట్లు ఇచ్చామని వివరించారు. ఈసారి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పీక్‌ సీజన్‌కు సరిపడేలా విద్యుత్తు సరఫరాకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు రిజ్వీ చెప్పారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్