నంద్యాల జిల్లా రెడ్డిపల్లెలో క్షుద్రపూజల కలకలం

     నంద్యాల జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలను మాత్రం ప్రజలు నమ్ముతూనే ఉన్నారు. ఆళ్లగడ్డ మండ లంలోని పలు గ్రామాలలో రాత్రి సమయాలలో క్షుద్ర పూజలు యధావిధిగా జరుగుతూనే ఉన్నాయి. రెడ్డిపల్లెలో క్షుద్ర పూజల కలకలం రేపాయి. రెడ్డిపల్లె, తువ్వ పల్లి గ్రామాల మధ్య ఉన్న స్మశా నం సమీపంలో ఉన్న రోడ్డుపై క్షుద్ర పూజలు జరిగాయి. క్షుద్ర పూజలు జరిగిన చోట నిమ్మకాయలు, పసుపు- కుంకుమ, మద్యం సీసాలు, తినుబండారాలు, మల్లె పూలు, ముగ్గులు, వేసి ఉన్నాయి. అర్ధరాత్రి సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రజలు సంచరించే మార్గమధ్యలో ఇలా క్షుద్ర పూజలు చేయడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రోజురోజుకు మండలంలోని కొన్ని గ్రామాలలో క్షుద్ర పూజలు జరుగుతూ ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు రాత్రి సమయాలలో బయటకు రావడానికి భయపడుతున్నారు. క్షుద్ర పూజలు జరిపి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న వారిని గుర్తించి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్