ఏపీలో అభివృద్ది కనిపించడం లేదు…పురందేశ్వరి

     ఏపీ అభివృద్ధిలో సింహ భాగం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదే అన్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. తిరుపతి ఉప ఎన్నికల్లో 35 వేల దొంగ ఓట్లు గుర్తించి సీఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు పురంధేశ్వరి. ఐపీఎస్‌ల మీద కూడా దొంగ ఓట్ల అంశంలో చర్యలు తీసుకుంటున్నారన్నారు. అభ్యర్ధిని మార్చడంతో పాటు, ఓటర్లను లోపాయకారిగా నియోజకవర్గం మారుస్తున్నారని ఆరోపించారు. ఏపీ అభివృద్ధిలో సింహ భాగం బీజేపీ చేసిందే అన్నారు. పార్లమెంటు అభ్యర్ధుల సంఖ్య ఈ సారి 350 దాటుతుందన్న ఆమె… పార్టీలతో పొత్తుపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అసలు కనిపించడం లేదన్నారు. రాష్ట్ర పథకాలు అన్నీ కేంద్ర పథకాలు అని తాము చెప్పినా.. మాకు సహకారం ఇవాళ్టి వరకూ లేదన్నారు పురందేశ్వరి.

Latest Articles

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు షాక్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. మంగళవారం తలపెట్టిన జనసేన సభకు అనుమతి నిరాకరించారు. రేపు రాష్ట్రంలో పార్టీ నవ నిర్మాణ సంకల్ప సభ ప్లాన్ చేసుకుంది...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్