అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల హఠాన్మరణం

       ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. వీరిలో ఒకరు వనపర్తికి చెందిన విద్యార్థి కాగా.. మరొకరు ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందినవారని తెలిసింది. వనపర్తి పట్టణంలోని రాం నగర్‌ కాలనీకి చెందిన గట్టు వెంకన్న, లావణ్య దంపతుల ఏకైక కుమారుడు దినేశ్‌ బీటెక్‌ చదివారు. అమెరికాలోని కనెక్టికట్‌ రాష్ట్రం ఫెయిర్‌ ఫీల్డ్‌లోని సేక్రెడ్‌ హార్ట్‌ విశ్వవిద్యాలయంలో MS చదివేందుకు గత ఏడాది డిసెంబరు 28న పయనమ య్యారు. వెళ్లిన 17 రోజులకే తమ కుమారుడు నిద్రలోనే చనిపోయినట్లు సమాచారం అందిందని బాధిత తల్లిదండ్రులు తెలిపారు. ఇతనితో పాటు శ్రీకాకుళం జిల్లా విద్యార్థి కూడా చనిపోయాడని తెలిసిందన్నారు. ఒకే గదిలో ఉన్న ఇద్దరు విద్యార్థులు నిద్రలోనే విగతజీవులుగా మారడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషవాయువు పీల్చడంతో చనిపో యి ఉండొచ్చని అక్కడి నుంచి సమాచారం వచ్చినట్లు తెలిపారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బాధిత కుటుం బాన్ని పరామర్శించి.. వివరాలు తెలుసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి మృతదేహాన్ని అమెరికా నుంచి వనపర్తికి రప్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితులను మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పరామర్శించారు.

Latest Articles

జగన్‌కు మంత్రి లోకేష్‌ సవాల్

మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు మంత్రి లోకేష్‌ సవాల్ విసిరారు. జగన్‌ ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్నానని.. డీఎస్సీపై అనుమానాలుంటే సమాధానం చెప్తానని అన్నారు. ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్