హైదరాబాద్, డిసెంబర్ 15 : సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. సీఎం కాన్వాయ్‌లోని 15 వాహనాలను 9 వాహనాలకు తగ్గించమని, తాను ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ జామ్‌లు లేకుండా, ట్రాఫిక్‌ను నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి విస్తృత స్థాయిలో పర్యటనలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో తాను ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏవిధమైన చర్యలు తీసుకోవాలో సూచించాలని పోలీస్ అధికారులను సీఎం కోరారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, ఇంటిలో కూర్చోవడం తనకు సాధ్యం కాదన్నారు.
సీఎం కాన్వాయ్‌తో ప్రజలకు ఇబ్బంది రానివ్వొద్దు: రేవంత్ ఆదేశం
0
283
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


