32.2 C
Hyderabad
Tuesday, March 17, 2026
spot_img

నీతా అంబానీ షష్టి పూర్తి సందర్భంగా ‘అన్న సేవ’

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మరియు చైర్‌పర్సన్ నీతా అంబానీ నవంబర్ 1న తన 60వ పుట్టినరోజును జరుపుకున్నారు. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 3000 మంది పిల్లల మధ్య నీతా అంబానీ ఈ వేడుకను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలకు చెందిన 1.4 లక్షల మందికి అన్నసేవ ద్వారా అన్నదానం చేశారు. అన్న సేవ ద్వారా దాదాపు 75 వేల మందికి వండిన ఆహారాన్ని అందించగా, సుమారు 65 వేల మందికి ముడి రేషన్ ను పంపిణీ చేశారు. ప్రధానంగా పిల్లలకు, వృద్ధాశ్రమాల్లో నివసించే వృద్ధులకు, రోజువారీ వేతన జీవులకు, కుష్టు వ్యాధిగ్రస్తులకు మరియు ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి ఆహారం అందించారు. ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ, విజయవాడ పట్టణాలలో రిలయన్స్ ఫౌండేషన్ అన్నసేవ కార్యక్రమాన్ని చేపట్టింది. సుమారు 600 మందికి కిట్ లను అందించారు.

కరోనా మహమ్మారి సమయంలో కూడా అన్న సేవ పేరుతో రిలయన్స్ ఫౌండేషన్ అతిపెద్ద ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. విద్య, మహిళా సాధికారత, క్రీడలు, కళ మరియు సాంస్కృతిక రంగాలలో నీతా అంబానీ లెక్కలేనన్ని విజయాలు సాధించారు. తన నాయకత్వంలో, రిలయన్స్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా 71 మిలియన్లకు పైగా ప్రజల జీవితాలను ప్రభావితం చేసింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్