ఇవాళ చంద్రబాబును కలవనున్న ఆయన కుటుంబ సభ్యులు

స్వతంత్ర వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబును ఆయన కుటుంబసభ్యులు ఇవాళ కలవనున్నారు. మూలాఖత్ లో భాగంగా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి సిబిఎన్ తో తాజా రాజకీయ అంశాలు, కోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషన్ల పరిస్థితిని వివరించనున్నారు. ఇందుకోసం భువనేశ్వరి, లోకేష్ ఇప్పటికే రాజమహేంద్రవరం చేరుకున్నారు. కాగా నిన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు లేఖ రాశారు. తన భద్రతపై అనేక అనుమానాలున్నాయని చంద్రబాబు తాను రాసిన లేఖలో వ్యక్తం చేశారు. అయితే.. చంద్రబాబు లేఖ నేపథ్యంలో జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు లేఖలో పేర్కొన్న అంశాలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మావోయిస్టు పార్టీ నుంచి హెచ్చరిక లేఖ వచ్చినట్టు పోలీసులు తమకు సమాచారం అందించారని వెల్లడించారు. దాంతో ఎస్పీ జైలుకు వచ్చిన భద్రతా ఏర్పాట్లను స్వయంగా సమీక్షించారని తెలిపారు.

Latest Articles

ఎబోలాపై తెలుగు రాష్ట్రాలు అలర్ట్

ఆఫ్రికాలో ఎబోలా వైరస్‌ విజృంభిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఎబోలాపై హై అలర్ట్‌ ప్రకటించారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో థర్మల్‌ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్