చిక్ బల్లాపూర్ రోడ్డు ప్రమాదంపై స్పందించిన సీఎం జగన్

స్వతంత్ర వెబ్ డెస్క్: ఈ రోజు ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని చిక్ బల్లాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కారు ట్యాంకర్ గుద్దుకున్న ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది అక్కడికక్కడే మరణించగా, ఒక్క వ్యక్తి మాత్రం తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో ఉన్నాడు. విషాదకరమైన విషయం ఏమిటంటే… చనిపోయిన వారు అంతా కూడా ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లాకు చెందినవారే కావడం చాలా బాధాకరం. తాజాగా ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన వారు మరణించడం నన్ను చాలా కలచివేసిందన్నారు. మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను అంటూ బాధపడ్డారు సీఎం జగన్. మరణించిన బాధిత కుటుంబాలకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి పరిస్థితి చాలా విషమంగా ఉన్న వ్యక్తికి మెరుగైన వైద్యం అందేలా చేద్దామన్నారు సీఎం జగన్. ఇక మరణించిన వారి గ్రామాలల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Latest Articles

నాని లైనప్ మారిందా..?

నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్