22.7 C
Hyderabad
Saturday, March 21, 2026
spot_img

భార్యపై అనుమానం.. బ్లేడుతో విచక్షణా రహితంగా భర్త దాడి

స్వతంత్ర వెబ్ డెస్క్: భార్యపై అనుమానంతో బ్లేడుతో విచక్షణా రహితంగా భర్త దాడిచేసి గాయపరిచాడు. విశాఖ జిల్లా ఆరిలోవ సిఐ సోమ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. వాసుపల్లి ప్రసాదు, వాసుపల్లి నీలిమ వీరు ఇరువురు భార్య భర్తలు. వీరి ఇరువురు మధ్య మనస్పర్థలు కారణంగా భార్య నీలిమ ఆరిలోవ టిఐసీ పాయింట్ వద్ద నివసిస్తోంది. భర్త ప్రసాద్, అత్త ముత్యాలమ్మ వీరు పూర్ణా మార్కెట్ లో నివసిస్తూవుంటారు. ఈ క్రమంలో బుధవారం భర్త ప్రసాద్, అత్త ముత్యాలమ్మ ఆరిలోవ వచ్చి తన భార్య నీలిమను మాట్లాడాలని బయటకు పిలిచి గొడవకు దిగాడు.

భర్త వాసుపల్లి ప్రసాదు తన వెంట తీసుకొచ్చిన బ్లేడు తో భార్య నీలిమను విచక్షణా రహితంగా గాయపరిచాడు. మెడ పైన, మొహంపైనా బ్లేడుతో గాయపరిచినట్లు సిఐ తెలిపారు. భార్య నీలిమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త ప్రసాదు, అత్త ముత్యాలమ్మ ఇరువురుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలియజేసారు. ఎస్సై సూర్యనారాయణ దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్