స్వతంత్ర వెబ్ డెస్క్: టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై(Revanth Reddy) పోలీస్ కేసు(Police Case) నమోదు అయింది. మహబూబ్ నగర్(Mahabub Nagar) జిల్లా పోలీసులపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొంతమంది నేతలు హైదరాబాద్ లోని గాంధీభవన్(Gandhi Bhavan) వేదికగా కాంగ్రెస్(Congress) లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… మహబూబ్ నగర్ జిల్లా పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్కొక్కడిని గుడ్డలూడదీసి కొడతానని పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కొంతమంది పోలీసుల పేర్లను తన డైరీలో రాసి పెట్టుకుంటున్నానని తెలిపారు.
రేవంత్ వ్యాఖ్యలను పోలీసు అధికారుల అసోసియేషన్‌లు ఖండిస్తున్నాయి. ఏ ప్రభుత్వం ఉన్నా చట్టానికి లోబడి పనిచేస్తామన్నారు. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ఇకనైనా పోలీస్ వ్యవస్థను విమర్శించే అలవాటు మానుకోవాలని పోలీసు అసోసియేషన్లు సూచించాయి. రేవంత్ రెడ్డిపై భూత్పూర్, జడ్చర్ల పోలీస్ స్టేషన్ లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


