స్వతంత్ర వెబ్ డెస్క్: నాలుగేళ్ల జగన్ పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్ప మరేం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉందని.. రైతు ఆత్మహత్యలపై జగన్ సర్కార్ సిగ్గుపడాలంటూ పేర్కొన్నారు. కేంద్ర పథకాలకు జగన్ తన ఫొటోను వేసుకుంటూ తన పేరుతో ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. విశాఖపట్నంలోని రైల్వే మైదానంలో జరిగిన బీజేపీ భారీ బహిరంగ సభలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. అల్లూరు సీతారామరాజు, విజయనగర రాజులను స్మరిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన అమిత్ షా.. జగన్ ప్రభుత్వం అవినీతి తప్ప మరేం చేయలేదంటూ విమర్శలు గుప్పించారు. రైతుల సంక్షేమ ప్రభుత్వం అని జగన్ చెబుతున్నారు.. అది నిజం కాదంటూ అమిత్ షా ఫైర్ అయ్యారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బును తామే ఇస్తున్నట్లు జగన్ చెబుతున్నారు.. ఉచితంగా ఇచ్చే బియ్యంపైనా జగన్ ఫొటోలా.. అంటూ అమిత్ షా ప్రశ్నించారు. జగన్ పాలనలో విశాఖపట్నం అరాచక శక్తులకు అడ్డాగా మారిందని.. కబ్జాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఏపీ అభివృద్ధికి పదేళ్లలో రూ.5 లక్షల కోట్లు ఇచ్చామని.. అన్ని లక్షల కోట్ల అభివృద్ధి రాష్ట్రంలో కనిపిస్తుందా..? అంటూ అమిత్ షా ప్రశ్నించారు. ఆ డబ్బంతా జగన్ ప్రభుత్వ అవినీతి ఖాతాల్లోకే వెళ్తోందని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. కేంద్రం ఇస్తున్న డబ్బులను రైతు భరోసా పేరుతో ఇక్కడ ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అమిత్ షా విమర్శించారు. కేంద్రం ఇస్తున్న ఇళ్ళను తమ పథకంగా చెప్పుకొంటున్నారన్నారు. రేషన్ బియ్యం మోదీ ఇస్తుంటే.. జగన్ తన బొమ్మ వేసుకుంటున్నారని దుయ్యబట్టారు. పంటలకు మద్దతు ధర కూడా పెంచామని గుర్తుచేశారు. తమను ఆదరిస్తే.. ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అమిత్ షా ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ఏపీలో అవినీతి తప్ప మరేం లేదు..
0
257
Previous article
Next article
Latest Articles
జక్కన్న.. నెక్ట్స్ ఏంటి..?
దర్శకధీరుడు రాజమౌళి.. వారణాసి అంటూ క్రేజీ పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పక్కా ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్న వారణాసి 2027 ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో...
- Advertisement -
- Advertisement -


