ఏపీలో అవినీతి తప్ప మరేం లేదు..

స్వతంత్ర వెబ్ డెస్క్:  నాలుగేళ్ల జగన్ పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్ప మరేం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉందని.. రైతు ఆత్మహత్యలపై జగన్ సర్కార్ సిగ్గుపడాలంటూ పేర్కొన్నారు. కేంద్ర పథకాలకు జగన్ తన ఫొటోను వేసుకుంటూ తన పేరుతో ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. విశాఖపట్నంలోని రైల్వే మైదానంలో జరిగిన బీజేపీ భారీ బహిరంగ సభలో అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేశారు. అల్లూరు సీతారామరాజు, విజయనగర రాజులను స్మరిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన అమిత్ షా.. జగన్ ప్రభుత్వం అవినీతి తప్ప మరేం చేయలేదంటూ విమర్శలు గుప్పించారు. రైతుల సంక్షేమ ప్రభుత్వం అని జగన్ చెబుతున్నారు.. అది నిజం కాదంటూ అమిత్ షా ఫైర్ అయ్యారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బును తామే ఇస్తున్నట్లు జగన్‌ చెబుతున్నారు.. ఉచితంగా ఇచ్చే బియ్యంపైనా జగన్‌ ఫొటోలా.. అంటూ అమిత్ షా ప్రశ్నించారు. జగన్‌ పాలనలో విశాఖపట్నం అరాచక శక్తులకు అడ్డాగా మారిందని.. కబ్జాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఏపీ అభివృద్ధికి పదేళ్లలో రూ.5 లక్షల కోట్లు ఇచ్చామని.. అన్ని లక్షల కోట్ల అభివృద్ధి రాష్ట్రంలో కనిపిస్తుందా..? అంటూ అమిత్ షా ప్రశ్నించారు. ఆ డబ్బంతా జగన్ ప్రభుత్వ అవినీతి ఖాతాల్లోకే వెళ్తోందని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. కేంద్రం ఇస్తున్న డబ్బులను రైతు భరోసా పేరుతో ఇక్కడ ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అమిత్ షా విమర్శించారు. కేంద్రం ఇస్తున్న ఇళ్ళను తమ పథకంగా చెప్పుకొంటున్నారన్నారు. రేషన్ బియ్యం మోదీ ఇస్తుంటే.. జగన్ తన బొమ్మ వేసుకుంటున్నారని దుయ్యబట్టారు. పంటలకు మద్దతు ధర కూడా పెంచామని గుర్తుచేశారు. తమను ఆదరిస్తే.. ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అమిత్ షా ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Latest Articles

తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ

ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్