33.2 C
Hyderabad
Monday, May 4, 2026
spot_img

పూర్తి మేనిఫెస్టో వస్తే వైసీపీ నేతల పరిస్థితి ఏంటో?: జవహర్

స్వతంత్ర, వెబ్ డెస్క్: మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. ఓవైపు మేనిఫెస్టోపై వైసీపీ నేతలు వరుసగా విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలకు టీడీపీ నేతలు కూడా గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. మినీ మేనిఫెస్టోకే ఇంతగా భయపడుతుంటే.. పూర్తి మేనిఫెస్టో వస్తే వైసీపీ నేతలకు మాటలు కూడా రావని మాజీ మంత్రి జవహర్ ఎద్దేవా చేశారు. మహిళలను శక్తిమంతులుగా చేయడమే చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. పేదరికం చదువుకు అడ్డం కాకూడదనే ఉద్దేశంతో చదివే బిడ్డలందరికీ రూ.15వేలు ఇస్తామని ప్రకటించారన్నారు.

మహిళల కంట కన్నీరు రాకూడదనే ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారని కొనియాడారు. అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉండేందుకు సంవత్సరానికి రూ.20వేలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వైసీపీ చేయలేని పనులు టీడీపీ అధికారంలోకి రాగానే చేయబోతున్నామని స్పష్టంచేశారు. మహానాడు విజయవంతం కావడంతో వైసీపీ నేతలకు భయం పట్టుకుందని జవహర్ వెల్లడించారు.

Latest Articles

15 ఏళ్లు అధికారం ఇవ్వాలన్న చంద్రబాబు నినాదం ప్రజల్లోకి వెళ్తుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక బలమైన నినాదాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలంటే తమకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్