స్వతంత్ర, వెబ్ డెస్క్: నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉద్రిక్తత చోటుచేసుకుంది. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి జూపల్లి కృష్ణారావు.. కలెక్టరేట్ ను ముట్టడించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా వరిని రైతులనుంచి కొనుగోలు చేయలేకపోవడంతో కల్లాల్లోనే ధాన్యం నిలిచిపోయింది. దీంతో రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ జూపల్లి కృష్ణారావు ధర్నా చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం దగ్గర రాస్తారోకో నిర్వహించారు.