స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో మూడ్రోజులు భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. శ్రీకాకుళం, అనకాపల్లి, మన్యం, విశాఖ, కర్నూల్ జిల్లాలకు పిడుగు హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వేస్తాయని వెల్లడించింది. భారీ వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తెలంగాణలో కూడా పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.