పశ్చిమ బెంగాల్‌లో కమలం వికసించిందని.. ఈ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాశక్తి గెలిచిందని చెప్పారు. పార్టీని గెలిపించిన ప్రతీ ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలిచారని.. బెంగాల్ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని హామీ ఇస్తున్నానని మోదీ అన్నారు
కార్యకర్తల కృషి లేకపోతే ఈ చరిత్రాత్మక విజయం సాధ్యమయ్యేది కాదని అన్నారు ప్రధాని మోదీ. ఏళ్ల తరబడి వారు క్షేత్రస్థాయిలో శ్రమించారని.. ఎన్నో ప్రతికూలతలను అధిగమించారని చెప్పారు. కార్యకర్తలే బీజేపీ పార్టీకి అసలైన బలమని అన్నారు. కేరళలో విజయంపై యూడీఎఫ్ కు అభినందనలు తెలిపారు. వికసిత్ కేరళం కోసం కేంద్రం తరపున సహకారం కొనసాగిస్తామన్నారు.


