Yadadri | తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన యాదాద్రిలో మంగళవారం నుంచి యాదగిరీశుని జయంత్యుత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రోజువారీగా జరిగే శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం, శ్రీసుదర్శన హోమం, బ్రహ్మోత్సవాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి గీత తెలిపారు. ఈ విషయాన్ని కల్యాణం మొక్కులను నిర్వహించే భక్తులు గమనించాలని తెలిపారు. స్వామి వారి ఉత్సవాలు పూర్తయిన తరవాత మే 5వ తేదీ నుంచి నిత్యకల్యాణం, హోమం, బ్రహ్మోత్సవాలు పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అలాగే యాదాద్రికి అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ మే 2 నుంచి 4వ తేదీ వరకు నిత్యకల్యాణం నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.
యాదాద్రిలో నిత్యకళ్యాణానికి బ్రేక్.. మళ్ళీ ఎప్పటినుంచంటే?
0
419
Previous article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


