KTR: కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.45 కోట్లు

స్వతంత్ర వెబ్ డెస్క్: కామారెడ్డి(Kamareddy) నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.45 కోట్లు మంజూరు చేస్తున్నట్లు   మంత్రి కేటీఆర్(Minister KTR) ప్ర‌క‌టించారు.  రోడ్డు మార్గం ద్వారా ఉదయం 11:15 గంటలకు కామారెడ్డికి చేరుకొని, నేరుగా ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌కు వెళ్లారు. అక్కడ 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకొని, అనంతరం అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేల సంఖ్యలో ప్రజలు, కళాకారులు, మెకానిక్‌లు, బీఆర్ఎస్‌ శ్రేణులు తరలివచ్చారు.

మంత్రి వేముల వేముల ప్రశాంత్ రెడ్డితో( Minister Vemula Prashanth Reddy) కలిసి కామారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.28 కోట్లతో నిర్మించిన ఆరు లేన్ల‌ రహదారి, స్వాగత తోరణం, సెంట్రల్ లైటింగ్(Central Lighting), మీడియన్, రోడ్డు డివైడర్లను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆర్ అండ్ బీ చౌరస్తా (R&B Chowrasta) వద్ద కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) సహకారంతో.. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.

దాదాపు రూ. 28 కోట్లతో సెంట్రల్ లైటింగ్, ఆరు వరుసల రోడ్డు, స్వాగత‌ తోరణం, సెంట్రల్ మీడియన్ ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని అన్నారు.  అలాగే పట్టణంలో మున్సిపల్ డిపార్ట్‌మెంట్‌ రోడ్లు, స్టేడియం కోసం, అంతర్గత రహదారుల కోసం రూ. 20 కోట్లు మంజూరు చేయాలని, కోరగా తానూ మంజూరు చేసినట్లు తెలిపారు.

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్