ఎన్నికల ముందు వరుస పేలుళ్లతో దద్దరిల్లిన పాకిస్థాన్

  ఎన్నికల ముందు పాకిస్థాన్‌ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. బుధవారం బలూచిస్థాన్‌లో రెండు వేర్వేరు పేలుళ్లలో 30 మంది మృతి చెందారు. 52 మందికి పైగా గాయాల పాలయ్యారు. గురువారం పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. తొలి బాంబు పిషిన్‌ జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి కార్యాలయం బయట పేలింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా… 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. గుర్తుతెలియని వ్యక్తులు ఓ బ్యాగులో బాంబును అమ ర్చి ఘటనాస్థలిలో పెట్టి వెళ్లారని… తర్వాత రిమోట్‌తో దాన్ని పేల్చినట్లు పోలీసులు తెలిపారు.

        ఈ ఘటన జరిగిన గంటలోపే మరో బాంబు… అక్కడికి 150 కిలోమీటర్ల దూరంలోని ఖిలా అబ్దుల్లా ఏరియాలోని జమియత్‌ ఉలేమా ఇస్లామ్‌, పాకిస్థాన్‌ ఎన్నికల కార్యాలయం దగ్గర పేలింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పో గా… 22 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రెండు ఘటనల్లోనూ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలను పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లకుండా ఆపేందుకు ఉగ్రవాదులు ఎన్నికల అభ్యర్థు లను లక్ష్యంగా చేసుకుంటున్నారని సీనియర్‌ పోలీసు అధికారి అబ్దుల్లా జెహ్రీ అన్నారు. బలూచిస్థాన్‌లో మరింత భద్రతను పెంచుతామని ఎన్నికల సంఘం పేర్కొంది.ఉగ్రవాదం, హింస, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌… నేడు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనుంది. ఎన్నికల రోజున మొత్తం 12.85 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Latest Articles

ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?

ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్