మయన్మార్ లో జరిగే సైబర్ నేరాలకు ఆలవాలంగా మారింది.అయితే అక్కడ జరిగే ప్రతి సైబర్ నేరం వెనక భారతీ యులు ఉన్నారని తెలుస్తోంది. వాస్తవిక విషయాల్లోకి వెళితే భారతీయుల్ని మయన్మార్ లో అక్రమంగా నిర్భం దిస్తు న్నారు. వారితో సైబర్ నేరాలు చేయిస్తున్నారు. మయన్మార్ జరుగుతున్న సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల్లో మధ్యప్రదేశ్ లింకులు ఇటీవల బయటపడ్డాయి. ఉద్యోగాలు ఇస్తామని యువతను ఆశపెట్టి మయన్మార్ లో నిర్భందిం చబడిన వ్యక్తులు ముఠాల చెర నుండి బయట పడ్డారు. వారంతా ఉమ్మడి కరీంనగర్ కు చెందిన వారు కావ విశేషం. అయితే ఆ యువకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిచ్చిన ఫోన్ నెం,ల ఆధారంగా సీఐడీ బృందం మధ్యప్ర దేశ్ కు చెందిన మనోజ్ తోమర్ ను హైదరాబాద్ కు తీసుకు వచ్చి విచారించింది. అయితే పోలీసులు జరిపిన విచారణ లో కరీంనగర్ యువకుల్లాగానే తాను బాధితుడేనని తేలింది. మనోజ్ తోమర్ ను వాట్సప్ ద్వారా మభ్యపెట్టిన డానీ అనే వ్యక్తి వివరాల కోసం సీఐడీ బృందం తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే ఆ వాట్సాప్ నెం చాలా కాలం క్రితమే స్తంభిం చింది. దీంతో ఈ దర్యాప్తు ముందుకు సాగలేదు.