స్వతంత్ర వెబ్ డెస్క్: మెదక్ జిల్లాకు దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేయలేని పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మెదక్ సభలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక మెదక్‌కు రైలు వచ్చిందని, ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరిందని అన్నారు. కాళేశ్వరం ద్వారా మెదక్ జిల్లాకు నీళ్లు అందుతున్నాయని, మండుటెండలో సైతం మత్తడులు దుంకుతున్నాయని చెప్పారు. నేడు దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉండడానికి కర్త, కర్మ, క్రియ కేసీఆర్ అని కితాబిచ్చారు.
ప్రతిపక్షాలు అబద్ధాలతో కాలం గడుపుతుంటే కేసీఆర్ మాత్రం అభివృద్ధితో దూసుకెళ్తున్నారని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పదికి పది సీట్లు గెలిచి ముఖ్యమంత్రికి కానుకగా అందిస్తామని హరీశ్ అన్నారు. మెదక్‌లో ముఖ్యమంత్రి రెండు కొత్త పథకాలను ప్రారంభించారు. దివ్యాంగులకు రూ.3,016 నుంచి రూ.4,016లకు పెంచిన ఆసరా పింఛన్లను లబి్ధదారులకు పంపిణీ చేశారు. అలాగే బీడీ టేకేదార్లకు ఆసరా పెన్షన్ వర్తింపును కూడా ప్రారంభించారు.